
కూతురిపై తండ్రికి ఉన్న ప్రేమ అందరినీ కంటతడి పెట్టిస్తుంది. చనిపోయిన తన కూతురిని మరిచిపోలేని తండ్రి ఆమె సమాధి వద్ద పడుకున్నాడు. ఈ విషాద సంఘటన వివరాలను కింద చదవండి: నారాయణపేట రూరల్ – గోపాల్‌పేట వీధికి చెందిన లక్ష్మీ ప్రణిత హోలీ పండుగ సందర్భంగా ఆడుకుంటుండగా.. ఒక్కసారిగా మినీ వాటర్ ట్యాంక్ కూలిపోయి ఆమెపై పడిపోయింది. ప్రమాదంలో ప్రణిత తీవ్రంగా గాయపడి మరణించింది, అదే రోజు రాత్రి శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలు జరిగాయి. అయినా కూతుర్ని చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన తండ్రి మాత్రం మరిచిపోలేకపోయాడు.అంత్యక్రియలు పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన తండ్రి రమేష్ స్నానం చేసిన వెంటనే బయటకు వెళ్లాడు. రాత్రి 11.30 గంటలు దాటిన ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అనుమానం వచ్చి అమ్మాయిని పూడ్చిన స్థలానికి వెళ్లి చూడగా అక్కడే పడుకొని ఉన్నాడు. ఇది చూసిన అక్కడి వారు కూతురిపై తండ్రికి ఉన్న ప్రేమకు ఒక్కసారిగా కన్నీరు పెట్టారు. అనంతరం తండ్రి రమేష్ ను సముదాయించి ఇంటికి తీసుకొచ్చారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. కూతురిపై తండ్రికి ఉన్న ప్రేమకు తరించి పోతున్నారు. కూతురిపై ప్రేమతో ఓ తండ్రి చేసిన పని అందరిని కన్నీరు పెట్టిస్తుంది. చనిపోయిన తన కూతురిని మర్చిపోలేని తండ్రి కూతురు సమాది పక్కనే పడుకున్నాడు.

