banner

ఇకపై జీన్స్, టీషర్ట్స్ బ్యాన్! టీఎస్ ఆర్టీసీ సంస్థ ఎండీ సజ్జనార్ కీలక ఆదేశాలు

Written by

ఆర్టీసీ ఉద్యోగులు జీన్స్ ప్యాంట్లు, టీషర్ట్స్ వేసుకోకూడదని టీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ అధికారులు, వారి పరిధిలో పనిచేసే సిబ్బంది ఇక నుంచి జీన్స్ ప్యాంట్, టీ షర్టులు ధరించి విధులకు హాజరు కావొద్దంటూ తాజాగా ఆదేశాలు జారీ అయ్యాయి. టీఎస్ ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు కాకుండా మిగతా వాళ్ళు అంత క్యాజువల్ డ్రెస్సులు వేసుకొని వస్తున్నారని, అయితే ఆ తరహా వస్త్రధారణ సంస్థ గౌరవానికి భంగం కలిగించేలా ఉందంటూ సంస్థ ఎండీ సజ్జనార్ అభిప్రాయపడ్డారు. అందుకని ఇక నుంచి ఆర్టీసీ ఉద్యోగులు అందరూ యూనిఫాం, ఫార్మల్ డ్రెస్సులోనే విధులకు హజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *