
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న పాన్-ఇండియన్ చిత్రం పుష్ప 2. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 15న థియేటర్లలోకి రానుంది. అయితే పుష్ప చిత్రానికి సీక్వెల్‌గా పుష్ప ది రూల్ రూపొందనున్న సంగతి తెలిసిందే. ఇందులోంచి ప్రచురించబడిన పోస్టర్‌లు మరియు విశ్లేషణాత్మక అంశాలు అందరిలో గొప్ప అంచనాలను రేకెత్తించాయి. ఐకాన్ స్టార్ అభిమానులు పుష్ప 2 అప్‌డేట్‌ల గురించి సోషల్ మీడియాలో మేకర్స్‌ని అడుగుతూనే ఉన్నారు. అయితే తొందరలో అల్లు అర్జున్ బర్త్ డే ఉండటంతో కనీసం ఇప్పుడైనా ఏదైనా పుష్ప-2కు సంబంధించినవి ఇస్తారా? టీజర్ రిలీజ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నా సైలెంట్‌గా ఉండకయ్యా అంటూ ఓ నెటిజన్ శరత్‌ను ట్యాగ్ చేశాడు. ఈ క్రమంలో.. తాజాగా, అల్లు అర్జున్ ఎక్స్‌క్యూటివ్ ప్రొడ్యూసర్ శరత్ చంద్ర నాయుడు ఎట్టకేలకు స్పందించి గుడ్ న్యూస్ తెలిపాడు. ‘పుష్ప రాజ్ పుట్టిన రోజు నాడు ఏప్రిల్ 8న పుష్ప-2 టీజర్ రాబోతుంది ఫిక్స్’’ అని రిప్లై ఇచ్చాడు. దీంతో స్టైలిష్ స్టార్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది.

