banner

MLA మేడిపల్లి సత్యంకు కేంద్ర మంత్రి బండి సంజయ్ పరామర్శ

Written by

ఇటీవల భార్యను కోల్పోయిన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నివాసానికి వెళ్లిన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదివారం వెళ్లారు. హైదరాబాద్ అల్వాల్‌లోని ఎమ్మెల్యే ఇంటికి వెళ్లిన బండి సంజయ్‌ను చూడగానే మేడిపల్లి సత్యం బోరున విలపించారు. ఈ సందర్భంగా మేడిపల్లి సత్యంను బండి ఓదార్చారు. రూపాదేవి ఆత్మహత్య అత్యంత బాధాకరమని బండి సంజయ్ అన్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని, కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని భగవంతుడిని బండి ప్రార్థించారు. క్లిష్ట సమయంలో మనోధైర్యంతో వుండాలని బండి సంజయ్ ఎమ్మెల్యే కుటుంబానికి సూచించారు.

Article Categories:
వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *