
ఏప్రిల్ 2, 2011 భారత క్రికెట్ చరిత్రలో మరిచిపోలేని రోజు. 28 ఏళ్ల నిరీక్షణకు తెరపడి భారత క్రికెట్ జట్టు రెండోసారి వన్డే ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. 1983 తర్వాత ధోని సారథ్యంలో భారత జట్టు వన్డే వరల్డ్ కప్ గెలిచి సరికొత్త చరిత్ర లిఖించింది. సెమీ ఫైనల్లో పాకిస్థాన్‌ను ఓడించిన భారత్, ఫైనల్లో శ్రీలంకను ఓడించింది. భారత క్రికెట్ అభిమానులకు ఫైనల్ మ్యాచ్‌లో ధోని కొట్టిన సిక్స్ ఇప్పటికి కళ్ల ముందు కదలాడుతూనే ఉంటుంది. అయితే ఈ స్పెషల్ డే సందర్భంగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఓ స్పెషల్ ట్వీట్ చేశారు. ‘13 ఏళ్ల క్రితం.. నా చిన్ననాటి కల నిజమైన రోజు. ఆ జట్టు.. కోట్లాది మంది దేశ ప్రజల మద్దతు ఎప్పటికి ఓ మధురానుభూతిగా గుర్తుండిపోతుంది’ అని సచిన్ ట్వీట్ చేశాడు.
Article Categories:
క్రీడలు
