
బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను అందుకున్నారు. రాష్ట్రపతి స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి పురస్కారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా పలువురు నేతలు, అధికారులు హజరయ్యారు. కాగా పలు రంగాల్లో విశిష్ట సేవలు అందించి ప్రముఖులకు భారతరత్న ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది అత్యధికంగా మూడు విడతల్లో ఐదుగురు ప్రముఖులకు భారతరత్న ప్రకటించారు. అందులో నలుగురు ప్రముఖులు చనిపోయిన వారికి ప్రకటించగా.. శనివారం వారి కుటుంబసభ్యులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా భారతరత్న పురస్కారాన్ని అందజేశారు. మరో ప్రముఖుడైన ఎల్‌కే అద్వానీకి ఆదివారం ఉదయం ఆయన ఇంటికి వెళ్లి ప్రధాని మోదీ సమక్షంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అద్వానీకి భారతరత్న అవార్డును ప్రదానం చేశారు.