banner

గుండుతో కనిపించిన క్లింకార మెగా ప్రిన్సెస్. ఉపాసన చేసిన క్యూట్ పోస్ట్ వైరల్‌గా మారింది

Written by

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన వీరి పెళ్లయ్యాక పదేళ్లకు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చి మెగా ఇంట్లో సంబరాలు తీసుకొచ్చారు. మెగా ప్రిన్సెస్ రాకతో మెగాస్టార్ చిరంజీవి ఆనందానికి ఆవదులు లేకుండా పోయాయి. కానీ ఈ బుజ్జాయి ఫేస్ ఇంతవరకు రివీల్ చేయకపోవడంతో మెగా ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఎప్పుడెప్పుడు క్లింకార ముఖం చూద్దామా అని అభిమానులు ఎంతో క్యూరియాసిటీగా ఉన్నారు. ఇటీవల రామ్ చరణ్-ఉపాసన కుమార్తె క్లింకారతో వైజాగ్ బీజ్‌లో సందడి చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ పిక్స్‌లో మెగా ప్రిన్సెస్ ఫేస్ కనిపించి కనిపించకుండా ఉంది. అక్కడ చరణ్.. భార్య, కుమార్తెతో కలిసి సముద్రంలో మత్స్యకారులు సాంప్రదాయ వలల ద్వారా చేపలు పట్టే తీరును పరిశీలించారు.
చేపల వేట, వారు పడే కష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. తర్వాత వారితో కాసేపు ముచ్చటించారు. క్లింకారతో సముద్రం ఒడ్డున ఉండే చిన్న పాటి కొండపై సేదతీరి అందరినీ ఆశ్చర్యపరిచారు. మెగా క్యూట్ ఫ్యామిలీని చూడటానికి స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే తాజాగా ఉపాసన మరో పోస్ట్ పెట్టి మెగా ఫ్యాన్స్‌లో ఆసక్తి రేపుతోంది. ఇందులో రామ్ చరణ్ ఏనుగుకు స్నానం చేయిస్తున్నారు. ఉపాసన, క్లింకారను ఎత్తుకుని ఏనుగుపై చేయి పెట్టి చూస్తుంది. ఈ పోస్ట్‌లో క్లింకార గుండుతో చాలా క్యూట్‌గా కనిపించడంతో మెగా ఫ్యాన్స్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Article Categories:
సినిమా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *