banner

ఏపీలో బండి సంజయ్ చుట్టూ సందడి. టీడీపీ, జనసేన కార్యకర్తలు సెల్ఫీల కోసం పోటీపడుతున్నారు.

Written by

బీజేపీలో బండి సంజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సామాన్య కార్యకర్త స్థాయి నుంచి కేంద్ర మంత్రి వరకు చేరుకున్న ఆయన ప్రస్థానం, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు పార్టీ పెద్దల వద్ద ఆయనకు ఉన్న చొరవ అందరికీ తెలిసిందే. తెలంగాణలో ఏమీ లేదు అనుకున్న స్థాయి నుంచి పార్టీని పరుగులు పెట్టించిన ఆయన ఇటీవలే కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ బండి సంజయ్ కి అక్కడ అపురూప స్వాగతం లభించింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబుకు బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కారులో వెళ్తున్న బండి సంజయ్ తో సెల్పీ దిగేందుకు టీడీపీ, జనసేన శ్రేణులు పోటీ పడ్డాయి. యువకులతో పాటు మహిళలూ బండి సంజయ్ తో కరచాలనం చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Article Categories:
రాజకీయాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *