
IMD ప్రకారం, రాబోయే నాలుగు రోజుల్లో ఆంధ్ర మరియు తెలంగాణల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్, సిరిసిల్ల, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. మంగళవారం నుంచి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు స్వల్పంగా చల్లబడడంతో ప్రజలు ఎండ నుంచి ఉపశమనం పొందారు.
Article Categories:
వార్తలు
