banner

అతని వయస్సు 80 సంవత్సరాలు, ఆమె వయస్సు 70 సంవత్సరాలు.. ఓ వృద్ధ జంట వివాహం

Written by

ఓ వృద్ధ జంట పెళ్లి చేసుకోని అందరినీ ఆశ్చర్యపరిచారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అసలు పెళ్లి ఎందుకు చేసుకున్నారంటే.. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం వస్త్రం తండాలో గుగులోతు లాలమ్మ(70), సమిడా నాయక్ (80) దంపతులు 80 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకున్నారు. 70 సంవత్సరాల క్రితం గంధర్వ వివాహం చేసుకున్నారు. వీరికి నలుగురు కుమారులు, ఒక కూతురుకు జన్మనిచ్చారు. వీరి మనవళ్ళు, మనవరాళ్ళు తాత, నానమ్మ పెళ్లి చేయాలని సంకల్పంతో మనవడు యాకూబ్ పుట్టినరోజు సందర్భంగా పెళ్లి ఘనంగా నిర్వహించారు. దీంతో వృద్ధ దంపతుల పెళ్లి చూడడానికి తండాల్లో జనాలు తరలివచ్చారు.

Article Categories:
వార్తలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *