
వేసవి కాలం ప్రారంభం కావడంతో.. రాష్ట్రంలో ఎండలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న 3 రోజులు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్లు ప్రకటించింది. సాధారణ ఉష్ణోగ్రతలు కంటే 2-3 డిగ్రీల వరకు పెరిగే అవకాశముందని తెలియజేస్తూ ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో బహిరంగ ప్రదేశాల్లో పనిచేసేవారు. పగటి పూట ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే ఉపశమనం పొందే చర్యలు తీసుకోవాలని, అవసరం ఉంటేనే బయటకు రావాలని కోరుతున్నారు.
Article Categories:
వార్తలు
