banner

నిరుద్యోగులకు శుభవార్త. ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై మంత్రి కీలక ప్రకటన

Written by

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నిరుద్యోగులకు శుభవార్త అందించారు. బుధవారం సంగారెడ్డి జిల్లా రాయికోడ్‌లో నిర్వహించిన ‘బడి-బాట’ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయికోడ్ పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. త్వరలో ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వ బడులపై ప్రజల ఆలోచన విధానం మార్చుకోవాలని కోరారు. ప్రభుత్వ బడులు అందరివీ అనే భావన అందరికీ రావాలని సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాల పథకంలో అన్ని బడులు అభివృద్ధి చేస్తామని అన్నారు. మరోవైపు ఇవాళ్టి నుంచి తెలంగాణలో పాఠశాలలు పునఃప్రారంభం అయ్యాయి. వేసవి సెలవులు జూన్ 11వ తేదీ నాటికి పూర్తి కాగా.. నేటి నుంచి కొత్త విద్యా సంవత్సరం షురూ అయింది. ప్రభుత్వ బడుల్లో పిల్లల చేరికలను ప్రోత్సహించేందుకు సర్కార్ బడి బాట కార్యక్రమాన్ని చేపట్టింది. జూన్ 19వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఈ క్రమంలో టీచర్ పోస్టుల భర్తీపై మంత్రి ప్రకటన చేయడంతో నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *