
అనారోగ్య కారణాల వల్ల సోనియా గాంధీ తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు హాజరుకాలేకపోయారు. కాగా, ఆదివారం కాంగ్రెస్ అగ్రనాయకురాలు వీడియో సందేశాన్ని తెలంగాణ ప్రజలకు పంపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు స్టేట్ ఫార్మేషన్ డే శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ కోసం అమరులైన వారికి శ్రద్ధాంజలి తెలిపారు. ఆనాడు అధికారంలో ఉన్న తాము ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ఏర్పాటు చేశామన్నారు. పదేళ్లలో తెలంగాణ ప్రజలు తనను ఎంతో గౌరవించారన్నారు. తెలంగాణ ప్రజల కల నెరవేర్చే బాధ్యత తమపై ఉందన్నారు. అమర వీరుల కలలను నెరవేర్చాలని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను రేవంత్ సర్కారు అమలు చేస్తుందని ఆశిస్తున్నా అని ఆశాభావం వ్యక్తం చేశారు.
Article Categories:
వార్తలు
