
చెన్నై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీ మొత్తంలో హవాలా డబ్బును స్వాధీనం చేసుకున్నారు. చెన్నై నుంచి థాయ్‌లాండ్‌కు అక్రమంగా విదేశీ మారకద్రవ్యాన్ని తరలించేందుకు ప్రయత్నించిన వ్యక్తిని చెన్నైలోని అన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో సీఐఎస్‌ఎఫ్ బలగాలు అడ్డుకుంది. టూరిస్ట్ వీసాపై థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ వెళ్లాలని భావిస్తున్న నిందితుడిని పోలీసులు ప్రశ్నించారు. వ్యక్తి అస్పష్టమైన సమాధానాలు ఇవ్వడంతో, భద్రతా అధికారులు అతని సామాను మరియు లగేజీని శోధించారు. ఆ సూట్ కేసులో అమెరికా డాటర్లు, యూరోలు, సౌదీ రియాల్స్ సహా 3 కోట్లు విలువ చేసే వీదేశీ కరెన్సీ ఉండటంతో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అధికారుల ప్రాథమిక విచారణలో ఆ వ్యక్తి కేవలం కరెన్సీ క్యారియర్ మాత్రమేనని తేలింది. నిందితుడికి ఈ డబ్బు ఎవరు ఇచ్చారు? ఈ చర్యకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

