banner

కరీంనగర్‌లో ఆయన గెలిస్తే.. నేను రాజకీయ సన్యాసం చేస్తా: బండి సంజయ్ కీలక ప్రకటన

Written by

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు అంతా ఫేక్ అని.. అది ప్రధాని మోడీ సృష్టించిన కేసని మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుపై కోర్టులో విచారణ జరుగుతోందని.. దోషులు ఎవరో.. నిర్దోషులు ఎవరో కోర్టు తెలుస్తోందని స్పష్టం చేశారు. లిక్కర్ కేసు నుండి కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తుందని కేసీఆర్ చెబుతోంటే నవ్వొస్తోందని సెటైర్ వేశారు. కేసీఆర్ అంటున్నట్లుగా లిక్కర్ స్కామ్ కేసుకు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు అసలు సంబంధమే లేదని కొట్టి పారేశారు.
కేసీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. కరీంనగర్ పార్లమెంట్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ గెలిస్తే.. నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని బండి సంజయ్ సంచలన ప్రకటన చేశారు. ఈ సవాల్‌ను కేసీఆర్ స్వీకరించాలని డిమాండ్ చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క ఎంపీ సీటు కూడా రాదని బండి జోస్యం చెప్పారు. సీఎం రేవంత్ బీజేపీలోకి వస్తున్నాడని వినిపిస్తున్న వార్తలపైన ఆయన స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి ఏ పార్టీలోకి వెళ్తున్నాడో తనకు తెలియదని పేర్కొన్నారు.

Article Categories:
రాజకీయాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *