
ఫీజు రీయింబర్స్‌మెంట్ బాకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేసి విద్యార్థులను కాపాడాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. దీనిపై సీఎంను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసిన బండి.. ఇలా రాసుకొచ్చారు. గత మూడు సంవత్సరాల నుండి రాష్ట్రంలోని డిగ్రీ, ఇంజినీరింగ్ మరియు పీజీ కళాశాలల్లోని విద్యార్థుల ఫీజును గత BRS ప్రభుత్వం తిరిగి చెల్లించలేదు. దీంతో ప్రభుత్వం నుండి విద్యార్థులకు రావాల్సి రీయింబర్స్‌మెంట్ పెండింగ్ బకాయిలు రూ. 7,800 కోట్లకు చేరుకుంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పై విద్యార్థులకు హామి ఇచ్చింది. దీనిపై ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి తక్షణం శ్రద్ధ వహించాలి. లేకుంటే తెలంగాణలోని చాలా మంది విద్యార్థులు తమ విద్యపై, ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానంపై కూడా ఆశ కోల్పోతారని బండి తన ట్వీట్ చేశారు.
Article Categories:
వార్తలు
